సారీ.. రాలేకపోతున్నాం...కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ

  • ఈ నెల 30న ముగియనున్న భారత్ జోడో యాత్ర
  • ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం
  • ఇతర కార్యక్రమం వల్ల ముగింపు సభకు రాలేమన్న జేడీయూ
JDU not attending Bharat Jodo Yatra closing Sabha

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియబోతోంది. యాత్ర ముగింపు సభ జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనుంది. ముగింపు సభకు భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. జోడో యాత్ర ముగింపు సభకు రావాలని కోరుతూ లేఖలు రాశారు. 

అయితే ఈ ఆహ్వానాన్ని నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ తిరస్కరించింది. అదే రోజున తమ పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని అదే రోజున ప్రారంభిస్తున్నామని... అందుకే ముగింపు సభలో పాల్గొనలేకపోతున్నామని చెప్పారు. ఈ మేరకు ఖర్గేకు లేఖను రాశారు.

More Telugu News