రవితేజ పుట్టిన రోజు కానుక.. ‘రావణాసుర’ గ్లింప్స్ వీడియో

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రం
  • ప్రతినాయక పాత్రలో సుశాంత్
  • ఏప్రిల్ 7న విడుదల కానున్న చిత్రం
Raviteja  Ravanasura Glimpse release

ధమాకా, వాల్తేరు వీరయ్య ఘన విజయాలతో మాస్ మహారాజా రవితేజ జోరు మీదున్నారు. మరో భారీ విజయమే లక్ష్యంగా ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ చిత్రం చేస్తున్నారు. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం రావణాసుర తాజా పోస్టర్, గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. వీడియో చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఓ భవంతిలో యువతిని చంపగా.. బ్లాక్ సూట్‌ ధరించిన రవితేజ లోపలి నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగించి వీడియో ఆసక్తికరంగా ఉంది. సుశాంత్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.  

ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ నటిస్తున్నాడు. రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న చిత్రం  ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

More Telugu News