గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌

  • రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కేసీఆర్ పై గవర్నర్ పరోక్ష విమర్శలు
  • కొందరికి ఫామ్ హౌస్ లు ఉండటం కాదు.. అందరికీ ఇళ్లు ఉండాలన్న గవర్నర్
  • అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని విమర్శ
Kavitha satires on Tamilisai

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వం డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

 కేవలం కొందరి సంపదను పెంచడంపై కాకుండా... రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఎప్పటి నుంచో కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే ఈరోజు గవర్నర్ ప్రస్తావించారని... ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎద్దేవా చేశారు. 

ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ... కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదని... అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని... దేశాన్ని నిర్మించడమని చెప్పారు. జాతీయ రహదారులు, వందేభారత్ తదితర అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

More Telugu News