షారుక్ ‘పఠాన్’ ప్రభంజనం.. తొలి రోజే రూ. 100 కోట్ల వసూళ్లతో రికార్డు

  • నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం
  • భారత్ లో రూ. 67 కోట్లు రాబట్టిన పఠాన్
  • కేజీఎఫ్2 రికార్డు బద్దలు కొట్టిన షారుక్ ఖాన్
Shah Rukh Khan Pathaan beats Yashs KGF 2 collection on Day 1

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ఈ చిత్రం పలు భాషల్లో విడుదలైంది. బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను తట్టుకున్న ఈచిత్రం మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

దాంతో తొలిరోజు అత్యధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమా గా రికార్డు సృష్టించింది. భారత మార్కెట్ లోనే రూ. 67 కోట్ల గ్రాస్ రాబట్టింది. విదేశాల్లో రూ. 35 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే రూ. 102 కోట్లు వసూలు చేసింది. య‌శ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు 53. 9 కోట్ల క‌లెక్ష‌న్స్ తో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును పఠాన్ బద్దలు కొట్టింది.

More Telugu News