Ibm: ఐబీఎంలోనూ ఉద్యోగాల కోతలు!

  • 3900 మందిని ఇంటికి పంపనున్న కంపెనీ
  • నగదు లక్ష్యాలను అందుకోలేకపోవడం వల్లేనని వివరణ
  • రీసెర్చ్ విభాగంలో నియామకాలు కొనసాగుతాయని వెల్లడి
IBM Cuts 3900 Jobs In Latest Tech Layoffs

మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం కూడా చేరింది. నాలుగో క్వార్టర్ లో కంపెనీ నగదు లక్ష్యాలను అందుకోలేకపోయామని చెబుతూ 3,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అసెట్ డిజిన్వెస్ట్ మెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

తమ సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమేనని పేర్కొంది. అయితే, క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్ డెవలప్ మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ తెలిపారు.

ఐబీఎం కంపెనీ షేర్లు 2 శాతం పడిపోయాయి.. అయితే, దీని వెనక ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ప్రభావం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో క్వార్టర్ లో కంపెనీ నగదు లక్ష్యాలు అందుకోలేకపోవడమూ కారణమేనని చెప్పారు. ఐబీఎం గతేడాది క్యాష్ ఫ్లో 9.3 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది 10 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, నాలుగో క్వార్టర్ ముగిసేనాటికి ఈ మొత్తాన్ని ఆర్జించే పరిస్థితిలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News