కీరవాణికి పద్మశ్రీ రావడం పట్ల రాజమౌళి భావోద్వేగం

  • కీరవాణికి పద్మశ్రీ పురస్కారం
  • ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సి ఉందన్న రాజమౌళి
  • కీరవాణితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన రాజమౌళి
Rajamouli response on Padma Sri to Keeravani

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. దీనిపై ఆయన సోదరుడు, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అందరు అభిమానులు భావిస్తున్నట్టుగానే... ఈ గుర్తింపు మీకు ఎప్పుడో రావాల్సి ఉందని చెప్పారు. అయితే మీరు ఎప్పుడూ చెప్పే విధంగా ఒకరి శ్రమకు గుర్తింపు ఊహించని విధంగా అందుతుందని అన్నారు. తాను ఒకవేళ ఈ విశ్వంతో మాట్లాడగలిగితే... కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా... ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా అని చెపుతానని తెలిపారు. దీంతో పాటు కీరవాణితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఫొటోలో కీరవాణి ఛైర్ లో కూర్చొని వయోలిన్ వాయిస్తుండగా... రాజమౌళి ఆయన పక్కన కింద కూర్చున్నారు.

More Telugu News