ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలాన్ మస్క్

  • మిస్టర్ ట్వీట్ గా ప్రొఫైల్ కి పేరు
  • ట్విట్టర్ పై ప్రకటించిన ఎలాన్ మస్క్
  • దీన్ని తిరిగి మార్చుకునే అవకాశం లేదని స్పష్టీకరణ
Elon Musk is officially Mr Tweet on Twitter know the story behind his new name

ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరు మార్చుకున్నారు. ఆశ్చర్యపోకండి, అసలు పేరును ఆయన ఏమీ మార్చుకోలేదు. కాకపోతే ట్విట్టర్ లోనే తన ప్రొఫైల్ పేరు వరకు మార్చుకున్నారు. ‘మిస్టర్ ట్వీట్’ అనేది ట్విట్టర్ వేదికపై ఎలాన్ మస్క్ కొత్త పేరు. సోషల్ మీడియాలో పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ హాబీల్లో ఒకటి. 

ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో మిస్టర్ ట్వీట్ గానే కొనసాగుతారు. పేరును తిరిగి మార్చుకునేందుకు అవకాశం ఉండదు. తాను కొత్త పేరుకు స్టిక్ అవ్వాల్సిందేనని, తిరిగి పాత పేరుకు మారిపోవడానికి ట్విట్టర్ అనుమతించదని స్వయంగా మస్క్ ప్రకటించారు. 

ఇక మస్క్ మిస్టర్ ట్వీట్ అనే పేరు పెట్టుకోవడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. ట్విట్టర్ కు వ్యతిరేకంగా లోగడ కోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా, దీనిపై వాదనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అటార్నీ అనుకోకుండా ‘మిస్టర్ ట్వీట్’ అని సంబోధించారు. ఇది మస్క్ కు తెగ నచ్చేసింది. దీంతో ప్రొఫైల్ కు మిస్టర్ ట్వీట్ అని నామకరణం చేసేశారు. దీనికింద ఎలాన్ మస్క్ అని కూడా ఉండడాన్ని గమనించొచ్చు. ట్విట్టర్ కొనుగోలు చేయక ముందు నుంచీ.. ఈ ప్లాట్ ఫామ్ పై ఎలాన్ మస్క్ ఎంతో చురుగ్గా ఉండేవారన్న విషయం ఫాలోవర్లకు తెలుసు.

More Telugu News