Nara Lokesh: తిరుమల చేరుకున్న నారా లోకేశ్

Nara Lokesh reached Nara Lokesh
  • ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • కడపలో ప్రార్థనా స్థలాలను సందర్శించిన లోకేశ్ 
  • ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న టీడీపీ నేత
ఈ నెల 27న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ 'యువ‌గ‌ళం' పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. కుప్పం నుంచి శుక్ర‌వారం ఆరంభ‌మై, 4 వేల కిలోమీట‌ర్లు, 400 రోజుల‌పాటు సాగే యాత్ర‌కి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ ఉద‌యం ఆయన కుటుంబంతో కలిసి పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేశ్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కొడుకుని హ‌త్తుకుని ఉద్వేగానికి గుర‌య్యారు. 

అనంతరం భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, తాత నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు. తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. కడప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం కడప పెద్ద దర్గాని సంద‌ర్శించి, చాదర్ సమర్పించారు. మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. క‌డ‌ప‌లోనే మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే ఆయన బస చేస్తారు.



 

 
Nara Lokesh
Telugudesam

More Telugu News