తనయుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్న చంద్రబాబు.. బాలయ్య ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్.. ఫొటోలు ఇవిగో

25-01-2023 Wed 15:33 | Both States
  • ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • తాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన యువనేత
  • తండ్రి, మామయ్య ఆశీర్వాదాలు తీసుకున్న లోకేశ్
Nara lokesh chandrababu Balakrishna photos
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 27 నుంచి కుప్పంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయన ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత తారకరామారావుకు నివాళి అర్పించారు. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. 

అంతకు ముందు జూబ్లీహిల్స్ లోని నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి... అత్తమామలు బాలకృష్ణ, వసుంధర పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను లోకేశ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ను తండ్రి చంద్రబాబు ఆప్యాయంగా హత్తుకున్నారు. తన భర్తకు నారా బ్రాహ్మణి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. అనంతరం లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్ కు పయనమయ్యారు. కాసేపట్లో ఆయన కడపకు చేరుకోనున్నారు.