సాహసం ఇష్టపడేవారికి.. చిరునామాలు ఇవి..!

  • సముద్రంలో స్కూబా డైవింగ్ మరపురానిది
  • ఇందుకోసం గోవా, అండమాన్ వెళ్లాల్సిందే
  • జైపూర్, వారణాసిలో హాట్ ఎయిర్ బెలూన్ లో విహారం
adventures activities you can explore within India

కొందరికి సాహస క్రీడలు అన్నా, సాహస విన్యాసాలు అన్నా ఎంతో ఇష్టం. కొందరికి ఎంతో భయం. చూడ్డానికి కూడా ధైర్యం చేయలేరు. అయితే, అందరికీ ఈ వృత్తిని ఎంపిక చేసుకోవడం సాధ్యపడకపోవచ్చు. అలా అని వారిలో సాహసాల పట్ల అభిరుచి లేకుండా పోదు. అలాంటివారు తమ సాహస అభిరుచిని తీర్చుకునేందుకు కొన్ని ప్రాంతాలు, వేదికలు ఈ దేశంలో ఉన్నాయి. 

స్కూబా డైవింగ్ 
ఇది నీటి లోపల జర్నీ. నడుచుకుంటూ వెళ్లడం మాదిరే ఉంటుంది. నీటిలోపలి జీవులను దగ్గరగా చూస్తూ అలా సాగిపోవడం మరపురాని అనుభూతిని ఇస్తుంది. గోవా, అండమాన్ దీవులు స్కూబా డైవింగ్ కు ప్రముఖ కేంద్రాలుగా ఉన్నాయి. పగడపు దిబ్బలు, ఎన్నో రకాల సముద్ర జీవులకు ఈ ప్రాంతాలు అనుకూలం. 

హాట్ ఎయిర్ బెలూన్
 జైపూర్ ఏడారిపై హాట్ ఎయిర్ బెలూన్ లో ఎగిరిపోతుంటే ఆ మజాయే వేరు. సాహస ప్రియులకు ఈ క్రీడ కావల్సినంత ఉత్సాహాన్నిస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్ నుంచి పింక్ సిటీ అందాలను చూడొచ్చు. ఎన్నో చారిత్రక కట్టడాలకు జైపూర్ చిరునామాగా ఉంది. అలాగే, ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోనూ ఏటా దీన్ని నిర్వహిస్తుంటారు. వారణాసి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. 45 నిమిషాల పాటు వారణాసి పట్టణాన్ని చుట్టి రావచ్చు. స్థానిక టూరిజం ఏజెంట్ల ద్వారా దీని సమాచారం పొందొచ్చు.

స్కీయింగ్
 కాళ్లకు పొడవాటి కర్రల్లాంటివి ధరించి మంచు పర్వతాలపై వేగంగా జారిపోయే ఈ క్రీడను టీవీలలో చూసే ఉంటారు. జమ్మూ కశ్మీర్ లోని గుల్ మార్గ్ దీనికి కేంద్రం. ఇక్కడే 4,000 మీటర్ల ఎత్తున్న మౌంట్ అఫ్రావట్ నుంచి దీన్ని నిర్వహిస్తుంటారు.

More Telugu News