YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

  • వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు
  • తొలిసారి అవినాశ్ కు సీబీఐ నోటీసులు
  • ఈనెల 28న విచారణకు రావాలంటూ సీబీఐ ఆదేశాలు
CBI second notice to YS Avinash Reddy

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.

వివేకా హత్య కేసుకు సంబంధించి గత రెండున్నరేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అవినాశ్ ను ఇంతవరకు సీబీఐ విచారించలేదు. తొలిసారి ఆయనను విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే... నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా? అని అవినాశ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. తనకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని... విచారణకు హాజరు కావడానికి ఐదు రోజుల సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే అవినాశ్ కు సీబీఐ రెండో సారి నోటీసులను జారీ చేసింది. 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.

More Telugu News