అంత భయంకరమైన వ్యాధిని శ్రీవిద్య ఎవరికీ చెప్పలేదట!

25-01-2023 Wed 09:36 | Entertainment
  • హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీవిద్య 
  • కళ్లతోనే కట్టిపడేసిన నాయిక
  • ఆమె గురించి ప్రస్తావించిన పీఆర్ వరలక్ష్మి 
  • ఆమెను మోసం చేశారని వెల్లడి 
  • ఆస్తులు పోగొట్టుకుందని ఆవేదన
PR Varalakshmi Interview
శ్రీవిద్య పేరు చెప్పగానే ఆకాశమంత విశాలమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి .. ఆయా పాత్రలలో అవి పలికించిన హావభావాలు గుర్తొస్తాయి. అలాంటి శ్రీవిద్య గురించి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి పీఆర్ వరలక్ష్మి ప్రస్తావించారు. "మనోరమ .. శ్రీవిద్య లతో నాకు మంచి స్నేహం ఉండేది. మనోరమ చెప్పిన మాటలు నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడ్డాయి" అన్నారు. 

శ్రీవిద్య విషయానికొస్తే ఆమెవి ఎంతో అందమైన కళ్లు. సావిత్రి తరువాత కళ్లతోనే అద్భుతంగా నటించగల నటిగా శ్రీవిద్యను గురించి చెప్పుకోవచ్చు. కళ్లతోనే ఆమె మాట్లాడేవారు. ఆమె మంచి నటి మాత్రమే కాదు .. మంచి గాయని కూడా. నిజంగా ఆమె మనసు చాలా మంచిది. శ్రీవిద్య బాగా సంపాదించుకుంది .. కానీ మోసపోయింది. ఆస్తులన్నీ పోగొట్టుకుంది" అని చెప్పారు. 

"శ్రీవిద్యకి తన వాళ్లంటూ ఎవరూ లేరు. అందువలన ఆమె ఎవరినైతే నమ్ముతూ వెళ్లిందో వారే మోసం చేశారు. వాళ్లు ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నారు కనుక, నేను ఇంకా వివరాలు చెప్పలేను. తనకి కేన్సర్ వచ్చింది. ఆ వ్యాధిని గురించి ఆమె ఎవరికీ తెలియనీయలేదు. చివరి రోజుల్లో తెలిసి ఎవరైనా చూడటానికి వచ్చినప్పటికీ, అందుకు ఆమె అంగీకరించేది కాదు" అని చెప్పుకొచ్చారు.