బెల్లంకొండ శ్రీనివాస్ కి చాలా గ్యాప్ వచ్చేసిందే!

25-01-2023 Wed 08:53 | Entertainment
  • మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ శీను 
  • వరుసగా భారీ సినిమాలు చేస్తూ వెళ్లిన తీరు 
  • ప్రస్తుతం 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బిజీ 
  • లైన్లో లేని టాలీవుడ్ ప్రాజెక్టులు 
  • ప్లాన్ దెబ్బకొట్టేసిందంటూ టాక్     
Bellamkonda Srinivas Special
'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీనే ఒక రేంజ్ లో జరిగింది. ఆ తరువాత ఆయన చేసిన ఏ సినిమా కూడా తక్కువ బడ్జెట్ లో రూపొందలేదు. ఒక స్టార్ హీరో స్థాయి బడ్జెట్ సినిమాలనే చేస్తూ వెళ్లాడు. స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్న భామలు ఆయన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు. ఫ్లాపులు పడినా మాస్ హీరోగా మంచి కంటెంట్ ఉన్నవాడే అనిపించుకున్నాడు. 

ఆ మధ్య వచ్చిన 'రాక్షసుడు' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. ఆ తరువాత వచ్చిన 'అల్లుడు అదుర్స్' మాత్రం అలరించలేకపోయింది. ఈ సినిమా తరువాత ఆయాన ఏ డైరెక్టర్ తో చేయనున్నాడా అని ఎదురుచూస్తుంటే, 'ఛత్రపతి' హిందీ రీమేక్ ను సెట్ చేసుకుని బాలీవుడ్ వైపు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా కోసం బెల్లంకొండ శీను గట్టి కసరత్తు చేశాడు. ఈ సినిమాను అలా బాలీవుడ్ కి వదిలి వెంటనే వెనక్కి వచ్చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు ఆలస్యమైపోయింది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు .. బెల్లంకొండ ఎప్పుడు ఫ్రీ అయ్యేది తెలియదు. మొత్తానికైతే ఆడియన్స్ తో చాలానే గ్యాప్ వచ్చేసింది. ప్లానింగ్ విషయంలో మనవాడు పొరపాటు చేశాడనే టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది.