ఆస్కార్ బరిలో రెండు భారత డాక్యుమెంటరీలకు నామినేషన్లు

24-01-2023 Tue 22:01 | National
  • ఆస్కార్ నామినేషన్ల ఖరారు
  • వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రకటన
  • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ కు నామినేషన్
  • డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు నామినేషన్
Two Indian documentary films gets nominations in Oscars
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారత డాక్యుమెంటరీ చిత్రాలకు నామినేషన్లు ఖరారయ్యాయి. 

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ నామినేషన్ దక్కించుకోగా, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ నామినేషన్ పొందింది. ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీని షౌనక్ సేన్ రూపొందించగా, ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించింది. 

ఢిల్లీలో... గాయపడిన పక్షులను కాపాడే ఇద్దరు అన్నదమ్ములు మహ్మద్ సాద్, నదీమ్ షెహజాద్ ల ఇతివృత్తంతో 'ఆల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ తెరకెక్కింది.

ఇక ఓ అనాథ ఏనుగు పిల్ల కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఓ దక్షిణ భారతదేశ జంట ఇతివృత్తంతో 'ద ఎలిఫెంట్ విస్పరర్స్' షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీని రూపొందించారు.