Lakshmi Parvati: వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi political comments
  • ఫైబర్ నెట్ స్కాంలో కేంద్రం దృష్టి సారించాలన్న లక్ష్మీపార్వతి 
  • యువనేత జైలుకు వెళ్లడం తథ్యమని వెల్లడి
  • సహవాస దోషం పవన్ కల్యాణ్ కు అంటుకుందని వ్యాఖ్య 

వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ కుంభకోణంలో దోపిడీ చేసినవాడు నీతిమంతుడి రూపంలో ప్రజల ముందుకు వస్తున్నాడని వ్యాఖ్యానించారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి కూడా పాదయాత్ర చేస్తున్నాడంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ స్కాంపై కేంద్ర ప్రభుత్వం లోతుగా దృష్టి సారిస్తే యువనేత జైలుకు వెళ్లడం తథ్యమని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఆమె పవన్ కల్యాణ్ పైనా స్పందించారు. సహవాస దోషం పవన్ కల్యాణ్ కు అంటుకుందని, ఆయన తప్పుడు దారిలో వెళుతున్నారని వెల్లడించారు. చంద్రబాబుతో కలిసి వెళితే పవన్ కు నష్టం తప్ప ఏమీ మిగలదన్నారు. రాష్ట్రంలో విపక్షాలు ప్రజాకంటకంగా మారాయని, అమరావతిని రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చారని విమర్శించారు. వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News