Gauthami: ఎదుటివారిని అంచనా వేయలేకపోవటానికి కారణం అదే: నటి గౌతమి

  • వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు 
  • తల్లిదండ్రులు పోవడంతో ఒంటరితనం  
  • అదొక పరీక్షా కాలమని చెప్పిన గౌతమి
Gauthami Interview

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఒకే సమయంలో స్టార్ డమ్ చూసిన కథానాయిక గౌతమి. జీవితంలో అనేక ఆటుపోట్లను చూసిన నాయిక ఆమె. తాజా ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. "మా పేరెంట్స్ నన్ను ఎంతో గారంగా పెంచారు. నాకు అగ్గిపుల్ల గీయడం కూడా చేతకాదు. అంతలా వాళ్లు నన్ను చూసుకున్నారు. 16వ ఏటనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చేశాను" అన్నారు. 

"నాకు పాప పుట్టిన తరువాత నేను సింగిల్ పేరెంట్ గా ఉన్నాను. చేతుల్లో పసిబిడ్డను పట్టుకుని మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేశాను. ఆ తరువాత అమ్మ చనిపోయింది. నాన్న నా గురించే ఆలోచన చేసేవారు. తన శరీరం ఉన్నంత వరకూ నాకు సపోర్టుగా నిలుస్తానని అనేవారు. ఒక ఏడాది తరువాత ఆయన పోయారు" అని చెప్పారు.

ఇక ఇప్పుడు నేను .. నా బిడ్డ మాత్రమే మిగిలిపోయాము. అప్పటికే నాకంటూ కొంత ఇమేజ్ ఉంది .. బయటికి వెళ్లే పరిస్థితి లేదు. కరెంటు బిల్లు కట్టడం .. సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులు తీసుకుని రావడం కూడా నాకు తెలియదు. ఇల్లు గడిచే మార్గం చూసుకోవాలి .. పాపకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఇక ఇంటిపట్టునే ఉండిపోవడం వలన మనుషులను సరిగ్గా అంచనా వేయలేకపోయేదానిని. ఎవరు ఎలాంటివారు అనేది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News