Zomato: ఉద్యోగాలు ఊడుతున్న వేళ.. జొమాటోలో కొలువుల భర్తీకి ప్రకటన

  • 800 ఖాళీలు ఉన్నాయని ప్రకటించిన సంస్థ సీఈవో దీపిందర్ గోయల్
  • 5 లొకేషన్లలో వేకెన్సీలు ఉన్నాయని వెల్లడి
  • ఆసక్తి ఉన్న వారు తనకు మెయిల్ చేయాలని సూచన
Zomato Announces 800 Vacancies

ఆకులు రాలే శరదృతువులో చెట్లు చిగురించినట్లుగా.. వేలాది ఉద్యోగాలు ఊడుతున్న తరుణంలో.. జాబ్స్ భర్తీ కోసం జొమాటో ప్రకటన విడుదల చేసింది. దేశంలోని 5 లొకేషన్లలో 800 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ షేర్ చేశారు.

ఇంజినీర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, గ్రోత్ మేనేజర్స్ ను నియమించుకోవాలని చూస్తున్నామని తెలిపారు. అలాగే సీఈవోకు చీఫ్ ఆఫ్ స్టాఫ్, జెనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ ను హైర్ చేసుకోనున్నట్లు లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. ‘‘ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి నాకు (deepinder@zomato.com) మెయిల్ చేయండి. నేను లేదా నా బృందం మీకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఎక్కడెక్కడ, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం షేర్ చేయలేదు.

మరోవైపు "10 నిమిషాలకే డెలివరీ" సర్వీసును జొమాటో ఆపేసింది. ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ఏరియాల్లో గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వీసును ప్రారంభించింది. కానీ పలు కారణాలతో దాన్ని నిలిపేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.

More Telugu News