ముంబై ఎయిర్ పోర్టులో బ్రహ్మానందం.. వీడియో వైరల్!

24-01-2023 Tue 14:45 | Entertainment
  • తెల్లటి దుస్తులు, నల్లటి కళ్లజోడుతో బ్రహ్మీ సూపర్ లుక్
  • ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాల్లో బంధించిన పాపరాజ్జీలు
  • ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న బ్రహ్మానందం
Brahmandam spotted in Mumbai Airport
టాలీవుడ్ దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాల కంటపడ్డారు. తెల్లటి దుస్తులను, నల్లటి కళ్లజోడును ధరించి ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా పాపరాజ్జీలు ఆయనను తమ కెమెరాల్లో బంధించారు. సార్ మాస్క్ తీయండని ఒకరు కోరగా, ఆయన మాస్క్ ను తొలగించి, నవ్వులు చిందించారు. 

వెల్ కమ్ టూ ముంబై సార్ అంటూ మరొక వ్యక్తి బ్రహ్మీకి స్వాగతం పలికారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఎన్నో చిత్రాలలో నటిస్తున్నారు. మైక్ టెస్టింగ్ 143, గజదొంగ, ఫీల్ మై లవ్, నిన్ను చూసిన క్షణాన, భవానీ ఐపీఎస్, వాల్ పోస్టర్ తో పాటు మరిన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి.