'అక్కినేని.. తొక్కినేని' అన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కౌంటర్

24-01-2023 Tue 13:54 | Entertainment
  • 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్ లో బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలన్న అక్కినేని వారసులు
  • వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అని వ్యాఖ్య
Naga Chaitanya and Akhil reaction to Balakrishna comments on Akkineni
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం రాత్రి జరిగిన 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ 'అక్కినేని... తొక్కినేని' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం...' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.