Nara Lokesh: రేపు మధ్యాహ్నం 1.20 గంటల నుంచి.. నారా లోకేశ్ టూర్ షెడ్యూల్ ఖరారు.. వివరాలు ఇవిగో!

  • యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్రను చేపడుతున్న లోకేశ్
  • రేపు తన తాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్న టీడీపీ యువ నేత
  • రేపు, ఎల్లుండి టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసిన టీడీపీ
Nara lokesh tour schedule

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానుంది. యువగళం పేరుతో చేపడుతున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండికి సంబంధించి నారా లోకేశ్ టూర్ షెడ్యూల్ ను టీడీపీ ఖరారు చేసింది. 

లోకేశ్ టూర్ షెడ్యూల్:

  • రేపు (25వ తేదీ) మధ్యాహ్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు లోకేశ్ బయల్దేరుతారు. 
  • 1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తారు. 
  • తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది.  
  • మధ్యాహ్నం 2.15 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళతారు. 
  • అక్కడి నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కడపకు చేరుకుంటారు. 
  • సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. 
  • సాయంత్రం 6.30 గంటలకు కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 
  • అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 
  • 26వ తేదీ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు.  
  • అనంతరం తిరుమల నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటకు కుప్పం చేరుకుంటారు. 
  • 27వ తేదీన లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

More Telugu News