spicejet: సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ప్రయాణికుడిని దించేసిన స్పైస్ జెట్ పైలట్.. వీడియో ఇదిగో!

SpiceJet passenger arrested after crew deboards 2 over unruly behaviour
  • విమానంలో నుంచి దింపేసి, సెక్యూరిటీకి అప్పగించిన పైలట్
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఘటన
  • ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విమానంలోని సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని స్పైస్ జెట్ పైలట్ కిందికి దింపేశారు. విమానాశ్రయ సిబ్బందికి అప్పగించి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన స్పైస్ జెట్ విమానంలో సోమవారం రోజు చోటుచేసుకుందీ ఘటన. విమానంలో కేబిన్ క్రూతో ప్రయాణికుడి వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన తమ విమానంలో బోర్డింగ్ సందర్భంగా ఓ ప్రయాణికుడు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్ క్రూ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిని, తోడుగా ఉన్న మరో ప్రయాణికుడిని కూడా విమానంలో నుంచి దింపేశామని పేర్కొంది. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించామని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, విమానంలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన అబ్సర్ అలీ అని పోలీసులు వెల్లడించారు. అలీపై సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
spicejet
flight
misbehave
passenger
deported
police case

More Telugu News