ఫస్టు మూవీ షూటింగులో కెమెరా ఆన్ చేయగానే పడిపోయాను: నటి గౌతమి

24-01-2023 Tue 10:48 | Entertainment
  • నాజూకైన కథనాయికగా గౌతమి 
  • 120కి పైగా సినిమాలు చేసిన నటి 
  • తన కెరియర్ గురించిన ముచ్చట్లు 
  • ఫస్టు మూవీ తాలూకు సంగతులు
Gauthami Interview
తెలుగు తెరకి పరిచయమైన నాజూకైన కథానాయికలలో గౌతమీ ఒకరు . తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాలను కలుపుకుని 120 సినిమాలకి పైగా చేశారు. వచ్చేనెల 17వ తేదీన విడుదల కానున్న 'శాకుంతలం' సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. 

" మా పేరెంట్స్ ఇద్దరూ కూడా డాక్టర్స్ .. అయితే ఇద్దరికీ కూడా కళలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక రోజున నేను కాలేజ్ లో ఉండగా మా మదర్ వచ్చి నేరుగా నన్ను ఎన్టీఆర్ 'మల్లీశ్వరి' సినిమాకి తీసుకుని వెళ్లి మరీ చూపించారు. నేను కూడా డాక్టర్ ను కావాలనే అనుకున్నాను. కానీ సినిమాల వైపు వచ్చేశాను. అందుకు కారణం కూడా అమ్మానాన్నల ప్రోత్సాహమే" అన్నారు. 

"ఇక తెలుగులో 'గాంధీనగర్ రెండవ వీధి' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటివరకూ నేను నీడపట్టున పెరిగాను. ఇల్లు .. కాలేజ్ తప్ప రెండో వ్యాపకం ఉండేది కాదు. ఫస్టు సినిమా .. ఫస్టు సీన్ ను గోల్కొండలో చిత్రీకరించారు. మధ్యాహ్నం ఎండలో షూటింగు మొదలైంది .. కెమెరా ఆన్ చేయగానే కళ్లు తిరిగిపడిపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.