చేగువేరా కుమార్తె అలైదా గువేరాకు విజయవాడలో చేదు అనుభవం

23-01-2023 Mon 21:35 | Andhra
  • భారత్ లో పర్యటిస్తున్న చేగువేరా కుమార్తె, మనవరాలు
  • నిన్న హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం
  • నేడు విజయవాడలో కార్యక్రమానికి హాజరు
  • అలైదాకు చేగువేరా ఫొటో బహూకరణ
  • బహూకరించిన కాసేపటికే చోరీకి గురైన ఫొటో
Che Guevara daughter lost his father photograph after it presented in Vijayawada
క్యూబా విప్లవవీరుడు, ప్రపంచంలోని చాలామందికి స్ఫూర్తిదాత చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తెఫానియా గువేరా భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఒకట్రెండు రాజకీయ పార్టీలు మినహా, మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరై చేగువేరా కుమార్తెకు సంఘీభావం ప్రకటించారు. 

కాగా, తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన చేగువేరా కుమార్తె అలైదా గువేరాకు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అలైదా గువేరాకు చేగువేరా ఫొటోను బహూకరించారు. అయితే, కాసేపటికే ఆ ఫొటో కనిపించకుండాపోయింది. అలైదా గువేరాకు బహూకరించిన వేదికపైనే చోరీకి గురైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ ఫొటో దొరికితే తనకు పోస్టు ద్వారా పంపించాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.