Chiranjeevi: 200 కోట్ల క్లబ్ లో 'వాల్తేరు వీరయ్య'

Waltair Veerayya movie update
  • ఈ నెల 13న విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
  • మెగా మాస్ కంటెంట్ తో కనెక్ట్ అయిన మూవీ
  • ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 108 కోట్ల గ్రాస్ 
  • 10 రోజుల్లోనే 200 కోట్లకి పైగా రాబట్టిన సినిమా 
మాస్ యాక్షన్ కథల్లో మెగాస్టార్ ను పట్టుకోవడం కష్టం. సాధారణంగా మాస్ సినిమాల్లో మందుకొట్టే సీన్స్ సహజంగానే కాస్త ఎక్కువగా ఉంటాయి. మందుకొట్టి మాట్లాడే సీన్స్ లో చిరంజీవి ఎంతలా చెలరేగి పోతారనేది చాలామందికి తెలుసు. అలాంటి సీన్స్ 'వాల్తేరు వీరయ్య'లో పుష్కలంగా ఉండటం వలన, ఆ తరహా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఎక్కేసింది.

మైత్రీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను బాబీ తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 108 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 10 రోజుల్లోనే 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 

మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి మాస్ యాక్షన్ కి రవితేజ క్రేజ్ తోడు కావడం .. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ కనెక్ట్ కావడం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఎక్కువ మార్కులు కొట్టేయడం .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకోవడం వలన ఈ సినిమా ఈ స్థాయిలో దూసుకువెళుతోందని అంటున్నారు.
Chiranjeevi
Sruthi Haasan
Devisri Prasad
Waltair Veerayya Movie

More Telugu News