ఐసీసీ టీ20 టీమ్ లో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు

23-01-2023 Mon 17:42 | Sports
  • గతేడాది ప్రదర్శన ఆధారంగా ఎంపిక
  • పురుషుల, మహిళల టీ20 జట్లను ప్రకటించిన ఐసీసీ
  • పురుషుల జట్టులో కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలకు స్థానం
  • మహిళల జట్టులో స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్ లకు చోటు
Three Indian cricketers gets place in ICC Team Of The Year 2022
గతేడాది కనబర్చిన ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టీ20 టీమ్-2022ను ప్రకటించింది. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ లో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు లభించడం విశేషం. ఈ ఐసీసీ మేటి టీ20 టీమ్ లో డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలకు స్థానం లభించింది. 

కాగా, ఈ జట్టుకు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ ను కెప్టెన్ గా ప్రకటించారు. బట్లర్ నాయకత్వంలో ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ సభ్యులు వీరే...

జోస్ బట్లర్ (కెప్టెన్, ఇంగ్లండ్)
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
విరాట్ కోహ్లీ (భారత్)
సూర్యకుమార్ యాదవ్ (భారత్)
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)
సికిందర్ రజా (జింబాబ్వే)
హార్దిక్ పాండ్యా (భారత్)
శామ్ కరన్ (ఇంగ్లండ్)
వనిందు హసరంగ (శ్రీలంక)
హరీస్ రవూఫ్ (పాకిస్థాన్)
జోష్ లిటిల్ (ఐర్లాండ్)

ఇక, మహిళల విభాగంలోనూ ఐసీసీ... టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ ను ప్రకటించింది. ఐసీసీ ఉమెన్ టీమ్-2022లో భారత్ నుంచి విధ్వంసక ఓపెనర్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్ చోటు దక్కించుకున్నారు.