అవికా మూవీ నుంచి 'రింగు రింగు' ఫుల్ సాంగ్ రిలీజ్!

23-01-2023 Mon 17:21 | Entertainment
  • యూత్ కోసం రూపొందిన 'పాప్ కార్న్' 
  • అవికా జోడీగా సాయి రోనక్ 
  • సంగీతాన్ని అందించిన శ్రావణ్ భరద్వాజ్ 
  • వచ్చేనెల 10వ తేదీన సినిమా రిలీజ్
PopCorn full song released
అవికా గోర్ కి సాధ్యమైనంత త్వరగా ఒక హిట్ పడాలి. ఆమె కూడా అలాంటి ఒక హిట్ కోసమే వెయిట్ చేస్తోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి, 'పాప్ కార్న్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆమె జోడీగా సాయిరోనక్ కనిపించనున్నాడు. 

ఓ షాపింగ్ మాల్ లోని లిఫ్ట్ లో చిక్కుకు పోయిన ఇద్దరు యువతీ యువకుల కథ ఇది. సరదాగా షాపింగ్ మాల్ కి వెళ్లిన హీరో .. హీరోయిన్, హఠాత్తుగా జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ తో అక్కడ చిక్కుబడిపోతారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే కథ. భోగేంద్రనాథ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి, మురళీ గంధం దర్శకత్వం వహించాడు. 

శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'రింగ్ రింగ్ రింగ్ మబ్బులూది చూడు ఎంత గమ్మత్తో' అంటూ ఈ పాట  సాగుతోంది. వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. యూత్ కి ఎంతవరకూ ఈ సినిమా కనెక్ట్ అవుతుందనేది చూడాలి.