సొంత జీవోలే జగన్ ను ముంచబోతున్నాయి: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

23-01-2023 Mon 15:52 | Andhra
  • జీవో నెంబర్ 1 పనికి రాని జీవో అన్న బైరెడ్డి
  • సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే కానీ జగన్ కు నిద్ర పట్టదని ఎద్దేవా
  • సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన కడితే నష్టం జరుగుతుందని వ్యాఖ్య
Byreddy Rajasekhar Reddy comments on Jagan
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 అనేది పనికి రాని జీవో అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన సొంత జీవోలే ఆయనను ముంచబోతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే కానీ జగన్ కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. తమ భూముల త్యాగంతోనే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. శ్రీశైలం వద్ద కట్టాల్సిన తీగల వంతెనను సిద్దేశ్వరం వద్ద కడతామంటున్నారని... ఇక్కడ తీగల వంతెన కడితే ఎలాంటి నష్టం జరుగుతుందో జగన్ తో చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు.