నారా లోకేశ్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ స్పందన

23-01-2023 Mon 15:37 | Andhra
  • జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర
  • కుప్పం నుంచి యువగళం 
  • ఇప్పటికీ లభించని అనుమతి
  • టీడీపీ నేతల్లో ఆగ్రహం
Chittoor SP Rishant Reddy responds to Nara Lokesh Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర జరపనున్నారు. అయితే ఇంతవరకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. అన్ని వివరాలు పరిశీలించి నిబంధనల మేరకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ గానీ, రేపు గానీ పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసేందే. లోకేశ్ యువగళం యాత్రపై జిల్లా టీడీపీ నేతలు ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.