టాలీవుడ్ యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య

23-01-2023 Mon 15:15 | Entertainment
  • విశాఖలో ఆత్మహత్య చేసుకున్న సుధీర్ వర్మ
  • వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చనే అనుమానాలు
  • సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ చిత్రాల్లో నటించిన వర్మ
Tollywood actor Sudheer Varma commits suicide
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరానప్పటికీ... వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 

2013లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వర ముళ్లపూడి దర్శకత్వంలో వచ్చిన 'కుందనపు బొమ్మ' చిత్రంలో నటించాడు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా కీలక పాత్రలను పోషించాడు. 

ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించిన 'షూటౌట్ ఎట్ ఆలేర్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఇదే అతని చివరి ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. మరోవైపు వర్మ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.