జగన్ పాలనలో సీఐడీ నేర భాగస్వామ్య వ్యవస్థగా మారింది: లోకేశ్

23-01-2023 Mon 15:10 | Andhra
  • సెటిల్మెంట్లు, కబ్జాలకు సీఐడీ అడ్డాగా మారిందన్న లోకేశ్
  • జనం ఛీకొట్టేలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు
  • భూకబ్జాలకు సీఐడీని వాడుతున్నారని ఆరోపణలు
Lokesh take swipe at YCP govt
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. జగన్ పాలనలో సీఐడీ నేర భాగస్వామ్య వ్యవస్థగా మారిందని విమర్శించారు. సివిల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకు సీఐడీని అడ్డాగా మార్చారని ఆరోపించారు. సీఐడీ పేరు వింటేనే జనం ఛీకొట్టేలాగా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. 

విశాఖలో కల్లుగీత కార్మికుడ్ని ఎవరికోసం బెదిరించారని ప్రశ్నించారు. భూకబ్జాలకు సీఐడీని వాడడం సైకో పాలనలోనే చూస్తున్నామని లోకేశ్ విమర్శించారు. దసపల్లా భూములను కబ్జా చేసినవాళ్లను సీఐడీ పట్టుకోవాలని డిమాండ్ చేశారు.