వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను: రాయపాటి సాంబశివరావు

23-01-2023 Mon 14:59 | Andhra
  • తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామన్న రాయపాటి
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని ధీమా
  • లోకేశ్ పాదయాత్రకు అనుమతిని ఇవ్వాలని వ్యాఖ్య
Rayapati announces that he will not contest in next elections
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఎక్కడ సీటు ఇస్తే అక్కడ నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటే మంచిదేనని... వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. ఆరోజు చంద్రబాబు అనుమతిని ఇవ్వడం వల్లే జగన్ పాదయాత్ర చేయగలిగారని గుర్తు చేశారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు కూడా అదే మాదిరి అనుమతిని ఇవ్వాలని హితవు పలికారు. సీఎం తనకు కూడా మంచి మిత్రుడేనని చెప్పారు.