కంగన పాటకు డ్యాన్స్ తో దుమ్మురేపిన నేపాలీ యువతులు.. వీడియో ఇదిగో!

23-01-2023 Mon 12:52 | Offbeat
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఇన్ స్టాలో ఏకంగా రెండు కోట్లకు పైగా వ్యూస్
  • ఖాట్మండుకు చెందిన ది వింగ్స్ టీమ్ మహిళల ఫెర్ఫార్మెన్స్
A video of Nepali women dancing has gone viral on social media
పెళ్లిళ్లు, పార్టీల్లో డ్యాన్స్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. సందర్భం ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే లేటెస్ట్ పాటలకు కాలుకదపాల్సిందే. ఇటీవల పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే. ఇక, అంబానీ చిన్న కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఫ్యామిలీ మొత్తం ఫ్లాష్ మాబ్ చేసిన వీడియోలు చూసే ఉంటారు. ఇలాంటిదే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పాటకు నేపాలీ అమ్మాయిలు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కంగన నటించిన క్వీన్ సినిమాలోని లండన్ తమక్డ పాటకు ఈ అమ్మాయిలు సరదాగా వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా చూశారు.. డ్యాన్స్ అదరగొట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియోలో ఖాట్మండుకు చెందిన ది వింగ్స్ టీమ్ యువతులు కంగన పాటకు క్రేజీ మూమెంట్స్‌తో స్టెప్పులేస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. ట్రాక్ ప్యాంట్లు ధ‌రించి న‌లుగురు యువతులు సూపర్ గా డ్యాన్స్ చేశారు. భాంగ్రా డ్యాన్స్‌తో ఫుల్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. (వీడియో లింక్)