Narendra Modi: 21 అండ‌మాన్‌ దీవుల‌కు ప‌ర‌మవీరచ‌క్ర అవార్డు గ్ర‌హీత‌ల పేర్లు

21 islands of Andaman and Nicobar named after 21 Paramveer Chakra awardees names
  • ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం
  • నేతాజీ జాతీయ స్మారకం మోడల్ ను ఆవిష్కరించిన ప్రధాని
  • అండమాన్ నికోబార్ లోని దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని
ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు ప్రధాని నామకరణం చేశారు. ఈ 21 దీవులకు పరమవీరచక్ర పురస్కారాలను అందుకున్న 21 మంది పేర్లను పెట్టారు. 

ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్ నిర్మ‌ల్‌జిత్ సింగ్ శేఖ‌న్‌, మేజ‌ర్ రామ‌స్వామి ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నాయిబ్ సుబేదార్ బానా సింగ్‌, కెప్టెన్ విక్ర‌మ్ బాత్రా, మేజ‌ర్ సోమ‌నాథ్ శ‌ర్మ‌, సుబేదార్‌ లాన్స్ నాయ‌క్ క‌ర‌మ్ సింగ్‌, సెకండ్ లెఫ్టినెంట్ రామా ర‌ఘోబా రాణే, నాయ‌క్ జాదునాథ్ సింగ్‌, హ‌వ‌ల్దార్ పీరూ సింగ్‌, కెప్టెన్ జీఎస్ స‌లేరియా, లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ధాన్ సింగ్ త‌ప్పా, సుబేదార్ జోగింద‌ర్ సింగ్‌, మేజ‌ర్ శైతాన్ సింగ్, లెఫ్టినెంట్ మ‌నోజ్ కుమార్ పాండే, మేజ‌ర్ సంజ‌య్ కుమార్‌, సుబేదార్ మేజ‌ర్ యోగేంద్ర సింగ్ యాద‌వ్‌, కంపెనీ క్వార్ట‌ర్‌ మాస్ట‌ర్ అబ్దుల్ హ‌మీద్‌, లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఆర్దేశిర్ బుర్జోరీ తారాపోర్‌, లాన్స్ నాయ‌క్ ఆల్బ‌ర్ట్ ఎక్కా, మేజ‌ర‌ల్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్ర‌పాల్‌ ల పేర్లను 21 దీవులకు పెట్టారు.
Narendra Modi
BJP
Andaman Nicobar

More Telugu News