Pakistan: నకిలీ పత్రాలతో బెంగళూరులో ఉంటున్న పాక్ యువతి అరెస్ట్

Teenage Pakistani girl held in Bengaluru for forging documents staying illegally
  • ఖాట్మండు నుంచి భారత్ కు అక్రమంగా వచ్చిన 19 ఏళ్ల ఇక్రా
  • గేమింగ్ యాప్ ద్వారా పరిచయమైన యూపీ యువకుడితో పెళ్లి
  • బెంగళూరులో నివాసం ఉంటున్న ఇరువురిపై కేసు నమోదు
బెంగళూరులో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్థాన్ కు చెందిన 19 ఏళ్ల యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకొని ఆశ్రయం కల్పించిన ఉత్తరప్రదేశ్ యువకుడిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పాకిస్థాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరానికి చెందిన ఇక్రా జీవాని అనే యువతి.. ఓ గేమింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ తో ప్రేమలో పడింది. అతని సహకారంతో ఇక్రా గతేడాది సెప్టెంబర్ లో నేపాల్‌లోని ఖాట్మండు నుంచి భారత్ కు అక్రమంగా వచ్చింది.

 అనంతరం ములాయంను పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరూ బెల్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ములాయం సింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే, నకిలీ పత్రాలో పాక్ యువతి నివాసం ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకు అప్పగించారు. ఆమెను పెళ్లి చేసుకున్న ములాయంపై కూడా కేసు నమోదు చేశారు.
Pakistan
teenage
girl
arrest
Bengaluru
staying illegally

More Telugu News