Ravindra Jadeja: రెండు పదాల ట్వీట్.. సీఎస్కే అభిమానుల్లో ఉత్సాహం

Ravindra Jadeja Two Worded Tweet Leaves Chennai Super Kings Fans Excited
  • వణక్కమ్ చెన్నై అంటూ ట్వీట్ చేసిన జడేజా
  • రంజీ ట్రోఫీలో భాగంగా చెన్నై చేరుకున్న సీఎస్కే ఆటగాడు
  • ఉత్సాహంగా స్పందిస్తున్న సీఎస్కే అభిమానులు
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మైదానంలో ప్రేక్షకులకు కనిపించి చాలా నెలలు అవుతోంది. 2022 సెప్టెంబర్ లో ఆసియా కప్ లో భాగంగా మోకాలికి గాయం కావడంతో అతడు భారత జట్టుకు దూరమయ్యాడు. అనంతరం చికిత్సతో కోలుకున్నాడు. వచ్చే నెలలో జరిగే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం జడేజాకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ లోపు తమిళనాడుతో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలో భాగంగా జడేజా చెన్నై వచ్చాడు.  

చెన్నై చేరుకున్న తర్వాత జడేజా ఓ రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ‘వణక్కమ్ చెన్నై’ అన్నదే ఆ ట్వీట్. చెన్నై ప్రజలకు నమస్కారం చెప్పాడన్నమాట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడేజా కీలక సభ్యుడని తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు సీఎస్కేతో కలసి సాగుతున్నాడు. జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో జడేజా ట్వీట్ కు చెన్నై జట్టు అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

‘‘జడేజాకు చెన్నై స్వాగతం పలుకుతోంది. సీఎస్కే అభిమాన ప్లేయర్ నువ్వు’’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘‘నా అభిమాన రోల్ మోడల్ కు వణక్కమ్. మైదానంలోకి తిరిగి సింహం అడుగు పెడుతోంది’’ అని మరో అభిమాని కామెంట్ చేశాడు. సూపర్ కింగ్ కు తిరిగి స్వాగతం, జడ్డూ నీ రాకింగ్ పెర్ ఫార్మెన్స్ కోసం వేచి చూస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలతో అభిమానులు స్పందిస్తున్నారు.
Ravindra Jadeja
Tweet
Chennai Super Kings
Fans
Excited

More Telugu News