ఏపీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంపు

22-01-2023 Sun 21:02 | Andhra
  • ప్రస్తుత సబ్ ప్లాన్ గడువు రేపటితో ముగింపు
  • మరో పదేళ్లకు పెంచిన ప్రభుత్వం
  • ఎస్సీ, ఎస్టీల విజ్ఞప్తి మేరకు పెంచామన్న ప్రభుత్వం
  • ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ
SC ST Sub Plan tenure extended in AP
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంచారు. సబ్ ప్లాన్ గడువు మరో 10 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు రేపటితో ముగియనుంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, సబ్ ప్లాన్ గడువు పెంచాలని ఎస్సీ, ఎస్టీలు విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. 

గడువు పెంపునకు సంబంధించిన ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ లో ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రచురిస్తారని తెలిపింది. సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపు, నిధుల వినియోగం, అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు వీలవుతుంది.