ఇదంతా బాలయ్య బాబు లీల: 'వీరసింహారెడ్డి ' సెలబ్రేషన్స్ లో సాయిమాధవ్ బుర్రా

22-01-2023 Sun 20:39 | Entertainment
  • సంక్రాంతి బరిలో హిట్ కొట్టిన 'వీరసింహారెడ్డి'
  • హైదరాబాదులో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్
  • కొన్ని డైలాగ్స్ బాలయ్యే చెప్పాలన్న సాయిమాధవ్ బుర్రా 
  • తన ముచ్చట తీరిందంటూ హర్షం
veerasimha Redddy Celebrations
బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతి పండుగ బరిలో సందడి చేసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలో .. ఈ సినిమా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ .. "ఈ కథ విన్నప్పుడే ఈ స్థాయిలో హిట్ అవుతుందని అనుకున్నాను .. అదే జరిగింది. ఒక పవర్ఫుల్ మాస్ సినిమా పడితే నేనేమిటో నిరూపించుకోవాలని అనుకుంటున్న సమయంలో నాకు ఈ సినిమా వచ్చింది" అన్నారు. 

"ఈ సినిమాకి పని చేయడం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు మాదిరిగా మారిపోయారు. ఆయన మాదిరిగానే ఆలోచించడం మొదలెట్టారు .. అందువల్లనే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. నా డైలాగులు బాగున్నాయనే దానికంటే, అవి బాలయ్య బాబు చెప్పడం వలన ఆ ఎఫెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను"అన్నారు. 

" కొన్ని డైలాగులు ఆయన చెబితేనే బాగుంటాయి .. ఆయన చెబితేనే  పేల్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా బాలయ్య లీల అంతే . ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్లో బాలయ్యకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అదే ఇంకో హీరో అయితే ఒప్పుకోడు. ఒక్క ఎక్స్ ప్రెషన్ తోనే ఆ సీన్స్ లో ఆయన గెలిచారు" అంటూ చెప్పుకొచ్చారు.