kollu ravindra: నారా లోకేశ్ పాదయాత్ర అంటే ప్రభుత్వం వణుకుతోంది: కొల్లు రవీంద్ర

  • యాత్రను ఆపాలని సీఎం జగన్, డీజీపీ కుట్రలు చేస్తున్నారని విమర్శ
  • ఎన్నడూ లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్న
  • పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
tdp leader kollu ravindra fires on ycp govt

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను ఆపాలని సీఎం జగన్, డీజీపీ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొల్లు రవీంద్ర నేడు మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. 

లోకేశ్ యాత్ర కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ రాక్షస ప్రభుత్వంలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో జనం ఉన్నారని, యువత దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. అందుకే నారా లోకేశ్ పాదయాత్ర చేపడుతున్నారని, దీంతో ప్రభుత్వానికి వణుకు మొదలైందని అన్నారు.

ఎన్నడూ లేని ఆంక్షలు కేవలం లోకేశ్ పాదయాత్రకు మాత్రమే ఎందుకు పెడుతున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన పాదయాత్రకు ఇలానే ఆంక్షలు పెడితే పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి మాటలు విని పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇబ్బందులు తప్పవని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

More Telugu News