Revanth Reddy: కేసీఆర్ ప్రమాదకరమైన వ్యక్తి... రాష్ట్రంలో స్మితా సబర్వాల్ వంటి వ్యక్తికే భద్రత లేదు: రేవంత్ రెడ్డి

KCR is dangerous person says Revanth Reddy
  • తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ నే మోసం చేసిన వ్యక్తి కేసీఆర్
  • కేసీఆర్ ను కాంగ్రెస్ ఎప్పటికీ నమ్మదు
  • బీజేపీకి మేలు చేసేందుకే బీఆర్ఎస్ డ్రామాలు
దేశంలో అత్యంత ప్రమాదకరమైన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదని చెప్పారు. కేవలం బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ డ్రామాను మొదలు పెట్టారని అన్నారు. 

సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి ఒక డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం ఈ రాష్ట్రంలోని దారుణ పరిస్థితికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. తనలాంటి పరిస్థితి ఏ మహిళకైనా వస్తే వెంటనే 100 నెంబర్ కు డయల్ చేయాలని స్మితా సబర్వాల్ అంటున్నారని... కేసీఆర్ మాత్రం 100 పైపర్స్ (మద్యం బ్రాండ్) అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే అధికారిణికే భద్రత లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని చెప్పారు.
Revanth Reddy
Congress
KCR
BRS
Smita Sabarwal
IAS

More Telugu News