DL Ravindra Reddy: జగన్ దృష్టిలో కాకపోయినా, ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని: డీఎల్ రవీంద్రారెడ్డి

Amaravati JAC leaders met former minister DL Ravindra Reddy
  • అమరావతికి మద్దతివ్వాలంటూ డీఎల్ ను కోరిన జేఏసీ
  • ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందన్న డీఎల్
  • జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లినా గెలవలేరని వెల్లడి
  • త్వరలోనే ప్రజలకు మంచి రోజులు రానున్నాయని వ్యాఖ్యలు
అమరావతి జేఏసీ నేతలు నేడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందిగా జేఏసీ నేతలు ఆయనను కోరారు. ఈ సందర్భంగా డీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టిలో కాకపోయినా, ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ గెలవలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ఉద్ఘాటించారు. 

జగన్ ఆలోచన అంతా అధికారం, డబ్బు తప్ప మరేమీ ఉండదని విమర్శించారు. ప్రత్యర్థులను వేధించడమే పని అని ఆరోపించారు. జగన్ మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని డీఎల్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రజలకు మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వెలిబుచ్చారు.
DL Ravindra Reddy
Amaravati JAC
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News