Shah Rukh Khan: రామ్ చరణ్ తీసుకెళ్తేనే థియేటర్ కి వస్తానంటున్న షారుక్ ఖాన్

SRK says he would love to vist any theatre in the Telugu States if RamCharan  takes him
  • ఈ నెల 25వ తేదీన విడుదల అవుతున్న షారుక్ ‘పఠాన్’ చిత్రం
  • హీరోయిన్ గా దీపిక పదుకోన్, విలన్ గా నటించిన జాన్ అబ్రహం
  • ప్రమోషన్స్ లో భాగంగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన షారుక్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. షారుక్ హీరోగా నటించిన ‘పఠాన్’ చిత్రం ఈ నెల 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. షారుక్  సరసన దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించగా, జాన్ అబ్ర‌హం ప్రతి నాయక పాత్ర పోషించాడు. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో షారుక్ ట్విట్టర్ అభిమానులతో ముచ్చటించారు. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘పఠాన్’  చిత్రం విడుదల నాడు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్ కి వస్తారా? అని ప్రశ్నించాడు. 

దీనికి సమాధానంగా రామ్ చరణ్ నన్ను తీసుకెళ్తే తప్పకుండా వస్తానని సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ బడా హీరో.. చరణ్ పేరు ప్రస్తావించడంతో ఆయన అభిమానులు ఖుషీ అయ్యారు. కాగా, ఈ నెల 10న ‘ప‌ఠాన్’ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్  సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి  బెస్టాఫ్ లక్ చెప్పారు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన షారుక్.. ‘మీ ఆర్ఆర్‌ఆర్ టీమ్‌ ఇండియాకు ఆస్కార్‌ను తీసుకొచ్చినప్పుడు దయచేసి దానిని టచ్‌ చేయనివ్వండి’ అని అన్నారు. షారుక్ దీన్ని ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ట్వీట్ చేయడం విశేషం.
Shah Rukh Khan
Ramcharan
pathan
movie
release
Bollywood

More Telugu News