astronomer: 93 ఏళ్ల వరుడు.. 63 ఏళ్ల వధువు.. అమెరికాలో చర్చిలో ఒక్కటైన జంట

SECOND MAN TO WALK ON MOON NOW GETS MARRIED ON 93RD BIRTHDAY
  • చంద్రుడిపైకి వెళ్లొచ్చిన వ్యోమగామికి నాలుగో పెళ్లి
  • చిరకాల ప్రేయసిని వివాహం చేసుకున్న బజ్ ఆల్ డ్రిన్
  • పుట్టిన రోజు నాడే ప్రేయసిని పెళ్లాడిన వృద్ధుడు
చంద్రుడిపై కాలుపెట్టిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కిన బజ్ ఆల్ డ్రిన్ తాజాగా మరోమారు పెళ్లి చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తన 93వ ఏట చిరకాల ప్రేయసి డాక్టర్ అంకా ఫౌర్ ను బజ్ పెళ్లాడారు. పుట్టిన రోజు నాడే ఈ వివాహ తంతు జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం బజ్ వయసు 93 ఏళ్లు కాగా.. అంకా ఫౌర్ వయసు 63.. తాజాగా బజ్ తన వివాహం తాలూకు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ వయసులో పెళ్లి చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, టీనేజ్ ప్రేమికుల తరహాలోనే కిక్ ఇస్తోందని చెప్పారు. అపోలో 11 అంతరిక్ష యాత్రలో భాగంగా 1969లో బజ్ ఆల్ డ్రిన్ చంద్రుడిపైకి వెళ్లారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన 19 నిమిషాల తర్వాత బజ్ అడుగుపెట్టారు. అపోలో 11 మిషన్ లో ముగ్గురు వ్యోమగాములు పాలుపంచుకోగా.. ఇప్పుడు బజ్ మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నారు.
astronomer
moon
93 years oldman
marriage
fourth marriage

More Telugu News