నారా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారు: దేవతోటి నాగరాజు
- లోకేశ్ పాదయాత్రకు జగన్ భయపడుతున్నారు
- లోకేశ్ పాదయాత్ర భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుంది
- పాదయాత్రకు అనుమతించే విషయంలో తాడేపల్లి ప్యాలెస్ తర్జనభర్జనలు పడుతోంది
మన దేశంలోనే అతి పిన్న వయసులో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా నారా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల, అరాచక పాలనపై లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మన దేశ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుందని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని అన్నారు.