Machu Picchu: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ 'మచు పిచ్చు' సందర్శనకు బ్రేక్‌

  • దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా పెరూలో కొనసాగుతున్న నిరసనలు
  • మచు పిచ్చు రైల్వే లైన్ ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • మచు పిచ్చు ఉన్న జిల్లాలో చిక్కుకుపోయిన 417 మంది టూరిస్టులు
Tourists not allowed to Machu Picchu

ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచు పిచ్చుకు ఆ దేశ ప్రభుత్వం పర్యాటకులను అనుమతించడం లేదు. దక్షిణ అమెరికా దేశం పెరూలో మచు పిచ్చు ఉంది. గత కొన్ని రోజులుగా పెరూలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా అక్కడ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మచు పిచ్చుకు పర్యాటకులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించడం లేదు. నిన్నటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. మచు పిచ్చుకు టికెట్లను బుక్ చేసుకున్న వారికి డబ్బును తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. 

మరోవైపు మచు పిచ్చుకు వచ్చే రైల్వే లైన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మచు పిచ్చు ఉన్న జిల్లాలో 417 మంది పర్యాటకులు చిక్కుపోయారు. వీరిలో 300 మంది విదేశీ టూరిస్టులు ఉన్నారు.

More Telugu News