Budda Venkanna: చంద్రబాబు, లోకేశ్ ప్రాణాలకు హాని ఉంది: బుద్దా వెంకన్న

Life threat is there for Chandrababu and Nara Lokesh says Budda Venkanna
  • లోకేశ్ తమ టార్గెట్ అని జగన్ చెప్పారన్న బుద్దా వెంకన్న
  • కేంద్ర ప్రభుత్వం లోకేశ్ కి భద్రత కల్పించాలని విన్నపం
  • పాయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లకు ప్రాణ హాని ఉందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్ర ఈ నెల 27న మొదలవుతుందని చెప్పారు. లోకేశ్ తమ టార్గెట్ అని సీఎం జగన్ అన్నారని... లోకేశ్ పై దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రత్యేక బలగాలతో లోకేశ్ కు భద్రత కల్పించాలని కోరారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాదయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవోపై హైకోర్టు అక్షింతలు వేసినా... సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయం జగన్ లో ఉందని చెప్పారు.
Budda Venkanna
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News