AP Police: ఏపీలో రేపు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. నిబంధనలివే

  • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా పరీక్ష
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  • ఫోన్లు, క్యాలికులేటర్లు, బ్లూటూత్ కు అనుమతిలేదు
  • ఒరిజినల్‌ గుర్తింపు కార్డు, హాల్ టికెట్, పెన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని పీఆర్ బీ సూచన
ap police constable preliminary exam on january 22

ఏపీలో పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఏపీఎస్ ఎల్ పీఆర్ బీ) ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. 

6,100 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరికి 997 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని, 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పీఆర్ బీ స్పష్టం చేసింది. 

ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్ లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలు, క్యాలికులేటర్, పర్సు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని చెప్పింది. వాటిని భద్రపరిచేందుకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవని, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని పేర్కొంది.

అభ్యర్థులు హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలని సూచించింది. అలాగే ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని చెప్పింది.

More Telugu News