Jr NTR: ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. ప్రముఖ యూఎస్ మేగజైన్ అంచనా

Jr NTR predicted as best actor contender for Oscar 2023 alongside Tom Cruise by US magazine
  • ఉత్తమ నటుడి కేటగిరీలో గట్టి పోటీదారుగా పేర్కొన్న మేగజైన్
  • టాప్-10 జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కు మొదటి స్థానం
  • ఎన్టీఆర్ నటనను అకాడమీ తప్పకుండా గుర్తిస్తుందన్న అంచనా
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా తన సత్తా చాటింది. నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలిచింది. అలాగే, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ నుంచి బెస్ట్ కొరియోగ్రఫీలో అవార్డు సొంతం చేసుకుంది. ఈ నెల 24న ప్రకటించే 95వ అకాడమీ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ మెరుస్తుందని భావిస్తున్నారు. ఇక సినిమా ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా పరిగణించే ఆస్కార్ 2023కు జూనియర్ ఎన్టీఆర్ ఈ విడత ‘బెస్ట్ యాక్టర్’ కేటగిరీలో గట్టి పోటీ ఇవ్వొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ పేర్కొంది. 

ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా పోటీలో ఉండే టాప్-10 నటుల జాబితాను ఈ మేగజైన్ పేర్కొనగా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ ను మొదటి స్థానంలో నిలిపింది. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు టాప్-10లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించడం తెలిసిందే. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరును అస్కార్ అవార్డుల అకాడమీ తప్పకుండా గుర్తిస్తుందని, బెస్ట్ యాక్టర్ కేటగిరీ నామినేషన్లలో తప్పక చోటు లభిస్తుందని అంచనా వేసింది.
Jr NTR
RRR
Oscar 2023
contender
US magazine

More Telugu News