GVL Narasimha Rao: కేసీఆర్ తిట్లను ఏపీ ప్రజలు మరిచిపోలేదు: జీవీఎల్ నరసింహారావు

AP people will not forget KCRs insults says GVL Narasimha Rao
  • ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ దెబ్బతీశారన్న జీవీఎల్
  • క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టాలని డిమాండ్
  • బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి ఎవరూ వెళ్లబోరని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో కూడా పార్టీని విస్తరించే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తిట్టిన తిట్లను, చేసిన అవమానాలను ఏపీ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసింది కేసీఆర్ అనే విషయాన్ని రాష్ట్రంలోని పిల్లలను అడిగినా చెపుతారని అన్నారు. 

ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని చెప్పి, తల వంచి క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి ఎవరూ వెళ్లరని తెలిపారు.
GVL Narasimha Rao
BJP
KCR
BRS

More Telugu News