YV Subba Reddy: తిరుమల క్షేత్రాన్ని డ్రోన్ తో చిత్రీకరించిన వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించాం: వైవీ సుబ్బారెడ్డి

  • వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్న వైవీ సుబ్బారెడ్డి
  • రెండు రోజుల్లో వాస్తవాలను వెల్లడిస్తామన్న టీటీడీ ఛైర్మన్
  • హైదరాబాద్ యువకులు వీడియో తీసినట్టు సమాచారం
TTD Chairman YV Subba Reddy response on drone camera shooting

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన వీడియో వైరల్ అవుతోంది. అత్యంత భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు. 

సోషల్ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వీడియోను పెట్టిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందు పెడతామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు ఈ వీడియో తీశారని తెలుస్తోంది. ఐకాన్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్ లోడ్ అయినట్టు గుర్తించారు.

More Telugu News