రేపే 'వీరసింహారెడ్డి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!

21-01-2023 Sat 10:48 | Entertainment
  • ఈ నెల 12న వచ్చిన 'వీరసింహారెడ్డి'
  • ఫ్యాక్షన్ కథకి ఎమోషనల్ టచ్ 
  • ఫస్టు డే వసూళ్లు 54 కోట్లు 
  • కొనసాగుతూనే ఉన్న వసూళ్ల జోరు 
  • హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో సెలబ్రేషన్స్  
Veera Simha Reddy Blockbuster Celebrations
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోగలిగింది. తొలి రోజునే 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి బాలయ్య కెరియర్లోనే కొత్త రికార్డును నమోదు చేసింది.

4 రోజుల్లోనే 104 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఇంకా అదే దూకుడును కొనసాగిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో 'వీరసింహుని విజయోత్సవం' పేరుతో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను రేపు నిర్వహించనున్నారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకు వేదిక కానుంది. 

ఇంతకుముందు బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ, ఈ సినిమాలోని పాయింట్ వేరు .. ట్రీట్మెంట్ వేరు. ఎమోషన్ ను కలుపుకుంటూ వెళ్లిన యాక్షన్ ఆడియన్స్ కే బాగా కనెక్ట్ అయింది. మాస్ మాటలు .. పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ అన్నీ కుదరడమే ఈ సినిమా సక్సెస్ కి కారణమని చెప్పచ్చు.